ఈ ఏడాదికి సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడిగిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఫిబ్రవరి 18 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. గతంలో ఇది ఫిబ్రవరి 11 వరకు ఉండేది. ఇదే సమయంలో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు కరెక్షన్ విండోను కూడా ప్రకటిస్తూ, ఇఫి ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 25 మధ్య అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్-2025కి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్కు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ద్వారా ప్రొఫైల్ను పూర్తి చేయాలి. లాగ్-ఇన్, ఫామ్ పూరించేందుకు ఓటీఆర్ ఆధారలు అవసరం. అవసరమైన ఫీజును చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా యూపీఎస్సీ 979 ఖాళీలను భర్తీ చేయనుంది..

