కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన సౌందర్య రాజన్
చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్ గారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఆలయ సీనియర్ అర్చకుడు సౌందర్య రాజన్ తీవ్రంగా స్పందించారు. ఆలయ సమీపంలోని అర్చకుల నివాసంలోకి చొరబడి దుండగులు రంగరాజన్ గాయపరిచారు. ఈ ఘటనను ఖండించిన సౌందర్య రాజన్ నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. భక్తులు, హిందూ సంఘాలు కూడా ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అర్చకుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

