బహిష్కరణ భయంతో అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి జీవితాన్ని ముగించుకున్న విషాద ఘటన వెలుగు చూసింది. అతడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు, అయితే సాయికుమార్రెడ్డి అనే యువకుడు ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వెళ్లి అక్కడ తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
అతడి స్నేహితుల కథనం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, సాయికుమార్రెడ్డి పనిచేసే సంస్థలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనను బహిష్కరించే అవకాశం ఉందనే భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సాయికుమార్రెడ్డి, తను పని చేసే ప్రదేశంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.

