మీసేవ ద్వారా రేషన్ కార్డుల జారీని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిలిపివేసిందని కొన్ని టీవీ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. అయితే, ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ లేదా మీసేవా మా కార్యాలయాన్ని సంప్రదించలేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రసారం అవుతున్న వార్తల్లో నిజం లేదని, అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ఈ రకమైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రికార్డును సరిచేసేందుకు మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

