ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ స్వీకరిస్తామని పేర్కొన్నారు. విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలియజేశారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తాము కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను రక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని కేజ్రీవాల్ అన్నారు.

