ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రారంభంలో లీడ్‌లో ఉన్న కేజ్రీవాల్, లెక్కింపు మధ్యదశలో వెనుకబడ్డారు. తొమ్మిది రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన 1,100 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. చివరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఆప్ పార్టీకి పెద్ద పరాజయంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఆరోపణలు చేసినప్పటికీ, చివరకు ఓటమిని ఎదుర్కొన్నారు.

