తెలంగాణ మహిళా క్రికెటర్ గొంగడి త్రిషను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి మరింత రాణించాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్ టీం సభ్యురాలు ధృతి కేసరి కి 10 లక్షల నజరానా ప్రకటించారు. అలాగే, అండర్-19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ఖదీర్, ట్రైనర్ షాలినికి చెరో 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.

