హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఇది చట్టపరంగా సాధ్యం కావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని పేర్కొన్నారు.
అసెంబ్లీ వేదికగా BRS, BJPలకు సవాల్ విసిరిన సీఎం, “చట్ట ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైతే మేము అమలు చేస్తాం. లేదంటే, కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% టికెట్లు కేటాయిస్తాం. మా వైఖరి స్పష్టంగా ఉంది. BRS, BJP కూడా ఇదే చేయగలరా?” అని ప్రశ్నించారు.
బీసీల హక్కులను రక్షించడంలో కాంగ్రెస్ వెనుకంజ వేయదని ఆయన స్పష్టం చేశారు.

