అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు.
మొదట ఆయనను ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం లక్నో ఆసుపత్రికి తరలించారు. CT స్కాన్ పరీక్షలో మెదడులో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

