తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3న వసంత పంచమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజున విద్యా దేవత సరస్వతి అమ్మవారిని పూజించే ప్రత్యేకత ఉంది. చిన్న పిల్లలకు స్కూళ్లు, దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 3న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అంటే, ఈ సెలవు విద్యాసంస్థల యాజమాన్యాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. హిందూ ఆలయాలు, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు వసంత పంచమి సందర్భంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
బాసరలో భక్తుల రద్దీ
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అమ్మవారి ఆశీస్సులతో పిల్లలకు జ్ఞానం, విజ్ఞానం మెండుగా లభిస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులు ఈ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

