ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా….
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష అభ్యర్థి మిడుదొడ్డి శ్యాంసుందర్
త్వరలో జరగనున్న నన్ను ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గెలిపించండి. మీ అభివృద్ధికి కృషి చేస్తా…. అంటూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలలో వున్న ఆర్యవైశ్యులను కలిసి రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తనకు ఓటు వేయమని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా హరిత హోటల్‌లో, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లా ముఖ్య నాయకులు, మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఇతర ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం, అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఆర్యవైశ్య ప్రముఖులతో మిడిదొడ్డి శ్యాంసుందర్ సమావేశమయి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలపై చర్చించి, తనకి ఓటు వేయమని అభ్యర్థించారు. అంతకముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ వైద్యులు శ్రీరామ్ లక్ష్మి కాంతారావు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు, మద్దతు దారులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

