నిజామాబాద్ జిల్లా బాసర లో ఎమ్మెల్యే రామారావు పటేల్, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి పుష్కర ఘాట్లను శుభ్రం చేసి, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చే వసంత పంచమి ఉత్సవాలకు ఆలయంలో సరైన ఏర్పాట్లు లేవని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు సరిపడా ప్రసాదాలు అందించాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు.

