జనగామ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వడ్లకొండ గ్రామ కార్యదర్శి దోర్నాల మనోహర్ స్వామి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు & అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న గ్రామ కార్యదర్శి ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం దోర్నాల మనోహర స్వామికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో వసంత , డీపీఓ స్వరూప, రిటైర్డ్ డీపీఓ రంగాచారి, ఎంపీడీవో సంపత్ కుమార్, అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, శేషాద్రి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందీప్ తేజ, నెల్లుట్ల రవీందర్ రావు, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, దోర్నాల శివప్రసాద్, దోర్నాల యోగేష్, దోర్నాల యశ్వంత్ పాల్గొన్నారు.

