భారత జాతిపిత గాంధీ మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్, లంగర్ హౌస్ లో గల బాపు ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, , మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను పాటించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రపై, దేశానికి ఆయన అందించిన మార్గదర్శకత్వం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. దేశం సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, గాంధీయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

