మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి KTR విమర్శలపై తీవ్రంగా స్పందిస్తూ, KTR, హరీశ్ తన కాలి గోటికి కూడా సరిపోరని విమర్శించారు. KCR కొడుకు, అల్లుడిగా రాజకీయాల్లో ఎదిగిన వారు నిజమైన ప్రజానాయకులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. “గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తారు?” అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. గద్దర్ ఉద్యమంలో ఉన్నప్పటికి, బండి సంజయ్ అప్పటికీ రాజకీయాల్లోకూడా రాలేదని, ఆయన చేస్తున్న విమర్శలు అసంబద్ధమని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

