అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. జనవరి 30నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, ఓటీటీ హక్కుల అమ్మకంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.275 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది, ఇది ఓటీటీ హక్కుల అమ్మకంలో ఒక భారతీయ చిత్రానికి లభించిన అత్యధిక రేటుగా నిలిచింది.
థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కు అదనంగా 20 నిమిషాల కొత్త సన్నివేశాలతో ‘రీలోడెడ్ వెర్షన్’ డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. దీనితో సినిమా మొత్తం నిడివి 3.40 గంటలుగా మారింది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జనవరి 30నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వెర్షన్ విడుదలపై స్పష్టత లేదు, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్‌లో హిందీ వెర్షన్ గురించి ప్రస్తావించలేదు.
ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ ఓటీటీలో అర్థరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. థియేటర్ విడుదలకు ముందే భారీ రేటుతో డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం, రీలోడెడ్ వెర్షన్ రావడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

