ఈ రోజు మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు సేవా భారతి తెలంగాణ బాధ్యులు తెలిపారు. ఫిబ్రవరి 02, 2025 ఆదివారం రోజున ఉదయం 7.00 గంటలకు బాలికల సాధికారత కోసం హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, టీ షర్ట్స్ ఆవిష్కరిస్తామని తెలిపారు.

