ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి శనివారం “నో బ్యాగ్ డే”గా పాటించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో ఆ రోజు కేవలం కో-కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించాలన్నారు. టీచర్లకు ఉన్న అనేక యాప్ల స్థానంలో ఒక్క యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. GO 117 ఉపసంహరణకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని, టీచర్ల బదిలీ చట్టంపై అభిప్రాయాలు సేకరించి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

