Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

డీప్‌సీక్… చాట్‭జీపీటీ కి మించి.

ఇప్పుడు ఎక్కడ చూసినా AI మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో AI మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక AI పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమిని, కోపైలట్ లాంటివి Alలో దూసుకుపోతున్నాయి. వీటన్నిటిలో చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినదొకటి వచ్చేసింది.

చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అమెరికాను మించి దూసుకెళ్తాంది. ఇప్పటి వరకూ AI అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేస్కుంటున్నాం. మొబైల్ పరిజ్ఞానం ఓ మోస్తరుగా ఉన్నవాళ్లంతా చాట్ జీపీటీని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మనకు ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఇంకేదైనా ట్రాన్స్ లేషన్ కావాలన్నా.. ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా.. చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తోంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. చాట్ జీపీటీతో పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతున్నాం.

ఇన్నాళ్లూ చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం.. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన AI టూల్ ను అభివృద్ధి చేసింది. అదే డీప్ సీక్..! ఇదిప్పుడు చాట్ జీపీటీని, అమెరికాను కూడా వణికించేస్తోంది. చైనా అంటే చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేతకాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా దూసుకెళ్తాంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని అమెరికా ఇన్నాళ్లూ భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది. ఇది నిజమేనా అని
ఆశ్చర్యపోతుంది

అసలేంటీ డీపీ సీక్.. ఇది ఏం చేస్తుంది..? చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీలేంటి..? అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ ను చూసి ఎందుకు భయపడుతున్నాయి..? చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది. దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డీప్ సీక్ ధాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా వణికిపోతోంది.

నిన్నటివరకూ డీప్ సీక్ పేరు పెద్దగా తెలీదు. కానీ అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తర్వాత దీనిపేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. డీప్ సీక్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ చేస్తున్నారు. చైనాలోని హ్యోంగ్ జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ ను అభివృద్ధి చేసింది. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ చేసిన పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ ఫెంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు AIని వినియోగించే హెడ్జ్ ఫండ్ కు ఈయన గతంలో నేతృత్వం వహించారు. ఇతని టీం ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ను డెవలప్ చేసింది. దీన్ని డీప్ సీక్ ఆర్1 అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ కి దీన్ని ఉచితంగా ఇచ్చింది. వాళ్లు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్ సీక్ ఆర్1ను వాడుకుంటున్నారు.

చాట్ జీపీటీతో పోల్చితే డీప్ సీక్ ఎందుకంత ప్రత్యేకం అని చాలా మంది ఆరా తీస్తున్నారు. దీని పనితీరు చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ చాట్ జీపీటీనే ఆర్టిఫిషియల్ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పడు డీప్ సీక్ పనితీరు చూసిన తర్వాత చాట్ జీపీటీ దీని ముందు దిగదుడుపే అని చెప్తున్నారు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండడం డీప్ సీక్ ప్రత్యేకత. చాట్ జీపీటీ సహా మిగిలిన సంస్థలేవీ ఈ పని చేయలేకపోతున్నాయి. అంతేకాదు.. చాట్ జీపీటీ లాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు. చాట్ జీపీటీ అభివృద్ధికి వంద మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయింది. కానీ డీప్ సీక్ ను కేవలం 5.6 మిలియన్ డాలర్ల ఖర్చుతోనే రూపొందించారు. పైగా డేటా విషయంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ డీప్ సీక్ మిగిలినవాటి కంటే చాలా ముందుంది.

డీప్ సీక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టాప్ మోస్ట్ ఆర్టిఫిషియల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయాయి. చైనా దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. డీప్ సీక్ పనితీరు టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆపిల్ స్టోర్ లో చాట్ జీపీటీని వెనక్కు నెట్టి డీప్ సీక్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. లక్షలాది మంది డీప్ సీక్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సర్వర్ తట్టుకోలేక క్రాష్ అయింది. ఆ వెంటనే డీప్ సీక్ AI అసిస్ట్ పై సైబర్ ఎటాక్ జరిగింది. దీంతో రిజిస్ట్రేషన్స్ ను తగ్గిస్తున్నట్టు డీప్ సీక్ వెల్లడించింది. మరోవైపు ఏఐపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికన్ టెక్ కంపెనీలకు డీప్ సీక్ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సోమవారం నాస్డాక్ 3 శాతం పతనమైంది. ఎన్విడియా సంస్థ షేర్లు 17 శాతం నష్టపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే 600 మిలియన్ డాలర్లను ఎన్విడియా నష్టపోయింది.

మరి డీప్ సీక్ లో లోపాలేవీ లేవా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇంత తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ మోడల్ ను నమ్మొచ్చా అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఏ కంపెనీకైనా కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే డీప్ సీక్ కు కూడా కొన్ని మైనస్ లు ఉన్నాయి. చైనా సంస్థ కావడమే డీప్ సీక్ కు అతిపెద్ద మైనస్. భద్రత విషయంలో ఈ సంస్థను పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. మన డేటాను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయి. డీప్ సీక్ డౌన్లోడ్ చేసుకునేవాళ్లు తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇది చైనా సంస్థ కాబట్టి తమ దేశ భద్రతాపరమైన అంశాలను డీప్ సీక్ సెన్సార్ చేస్తోంది. దేశాధ్యక్షుడు జిన్ పింగ్, తైవాన్ దురాక్రమణ లాంటి అంశాలపై ప్రశ్నలను ఇది తప్పించుకుంటోంది. కాబట్టి దీని ప్రామాణికతను నమ్మడానికి వీల్లేదు.

చాట్ జీపీటీ సహా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతోకొంత పేమెంట్ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్ సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ..! పైగా మిగిలినవాటి కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తోంది. అందుకే డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. మరి మున్ముందు ఇది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం..

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News