అడుగు దినదినాభివృద్ధి జరగాలి
సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించాలి
అడుగు డిజిటల్ మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు
అభినందించిన WETA ఫౌండర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల క్యాంప్ కార్యాలయంలో అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అడుగు ప్రత్యేక క్యాలెండర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, WETA ఫౌండర్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. అలాగే రాజా రామ్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. డా. మార్గం లక్ష్మీ నారాయణ 35 ఏళ్ళ పైగా జర్నలిజంలో తనదైన శైలిలో నీతి నిజాయితీ గా పనిచేశారన్నారు. వారి సలహాలు, సూచనలతో ఎంతో మంది రాజకీయ నాయకులు గా ఎదిగారన్నారు. వారి నేతృత్వంలో వచ్చిన అడుగు డిజిటల్ మీడియా ప్రజా పక్షంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇది డిజిటల్ మీడియా యుగమని, ఈ సమయంలో ఈ సంస్థ ప్రారంభించడం అభినందనీయం అన్నారు.

అదే సందర్భంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. అడుగు అంటేనే ప్రశ్నించడం అని డా. మార్గం లక్ష్మీ నారాయణ అందులో ముందు ఉంటారన్నారు, సమాజంలో తప్పులను ఎత్తి చూపడమే లక్ష్యంగా అడుగు పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రత్యేకంగా తమ మీద ప్రేమతో క్యాలెండర్ తయారు చేసిన అడుగు డిజిటల్ మీడియా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారి నాన్న డా. మార్గం లక్ష్మీ నారాయణ వేసిన అడుగులో తన అడుగు వేసి సమాజంలో మార్పు కోసం తన వంతు పాత్ర పోషిస్తున్న అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టూడెంట్ ఫర్ సేవ ట్రస్ట్ & మార్గం ఫౌండేషన్ చైర్మెన్ మార్గం సాయి సందీప్ తేజ ను అభినందించి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, కార్యదర్శి అశోక్, గిరగాని కళ్యాణ్ కుమార్ గౌడ్,ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




