కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. సునీల్ రావు కి కేంద్రమంత్రి బండి సంజయ్ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో తన వర్గంగా ఉన్న ఇతర కార్పొరేటర్లు బిజెపిలో చేరారు. ఈరోజు ఉదయమే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మేయర్ సునీల్ రావు మధ్యాహ్నం లోపు బిజెపి పార్టీలో చేరడం చర్చనియాంశమైంది.

