ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ముసాయిదా బిల్లు విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ బిల్లో ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫారసు చేసినట్లు సమాచారం. 2016 సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టు డీఎస్ఆర్సీలకు (కలెక్టర్ నేతృత్వంలోని ఫీజుల నియంత్రణ కమిటీలకు) ఫీజులను నియంత్రించలేని హక్కు లేదని నిర్ణయించిన విషయం గుర్తుచేస్తూ, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఫీజు నియంత్రణ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది.

