పాలకుర్తి మండలం, దర్దేపల్లి గ్రామంలో శ్రీశ్రీ చత్రపతి శివాజీ యువసేన యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా యువతలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

