జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో గల సిద్ధార్థ విద్యాలయం లో 10వ తరగతి విద్యార్థి ఆర్. సంజయ్ నేషనల్ గర్ల్ చైల్డ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రధమ బహుమతిని గెలుచుకోగా, ఈ రోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా చేతుల మీదుగా సంజయ్ కి బహుమతి అందించి, విద్యార్థి ప్రతిభను మెచ్చుకుని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాలయం కరస్పాండెంట్ జక్కుల ఊర్మిల, ప్రిన్సిపాల్ జక్కుల రవీందర్, మేనేజ్మెంట్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొని సంజయ్ ను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉత్తమ ప్రోత్సాహం అందించడంలో సిద్ధార్థ విద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని కరస్పాండెంట్ జక్కుల రవీందర్ తెలిపారు. బహుమతి పొందిన సంజయ్ తన విజయానికి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాధించగలిగానని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే విధంగా సిద్దార్థ స్కూల్ పనిచేస్తుందని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

