వైరల్ అవుతున్న AI వీడియో
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధమవుతున్నారంటూ తయారుచేసిన ఒక AI వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీడియోలో గాంధీజీ ట్రిమ్మింగ్ చేసుకొని, స్నానం చేసి, ఖాదీ వస్త్రాలు ధరించి, వేడుకలకు సిద్ధమవుతున్నట్లు చూపించారు.
వీడియో చివర్లో ఆయన చిరునవ్వుతో జాతీయ జెండాను చూపిస్తూ కనిపిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. AI సృష్టించిన ఈ రకమైన వినూత్న వీడియోలు ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూనే వినోదం కూడా పంచుతున్నాయి.

