స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనకు బహిరంగ లేఖ రాస్తూ, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో కవిత, “మీ వైఖరితో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల పెంపు సమస్యను మరింత కాలం నిర్లక్ష్యం చేయలేం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి,” అని స్పష్టంగా పేర్కొన్నారు. బీసీ హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బీసీల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూడాలని లేఖలో పేర్కొంటూ, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

