హైదరాబాద్ గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో ఇటీవల చేరిన కొంతమందికి పదవులు ఇవ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకున్న అనుభవాన్ని పరిగణించకుండా, కొత్తవారికి పదవులు కట్టబెట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకొని, ఇరు వర్గాలు మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా పార్టీకి అహర్నిశలు సేవలు అందించిన తమకు అవకాశాలు లేకపోవడం బాధాకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పార్టీ పెద్దలు పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు తీసుకున్నారు.

