ఇరాక్ ప్రభుత్వం కొత్త వివాదాస్పద చట్టాన్ని అమలు చేసింది, దీని ద్వారా పెళ్లి కనీస వయస్సు 18 నుండి 9 సంవత్సరాలకు తగ్గించబడనుంది. మత పరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం, షియా ముస్లిం తెగలు పాటించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికల వివాహం చట్టబద్ధమవుతుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు దీనిని మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఉందని, బాల్య వివాహాల వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందడం దేశవ్యాప్తంగా గట్టిగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

