తెలంగాణలో ప్రైవేట్ రంగ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ & టెస్టింగ్ యూనిట్ స్థాపన కోసం హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అత్యాధునిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ ఆధిపత్యం చూపిస్తున్న ఈ కంపెనీ విజయాన్ని గర్వంగా స్వీకరించినట్లు సీఎం చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

