పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం
లింగాల ఘనపూర్ మండలం నవాబ్ పేట గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ నాయక్ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రారంభించి యాజమాన్యాన్ని ఆశీర్వదించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల తొర్రూరు మున్సిపాలిటీ, మండలంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

