సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్సలో భాగంగా వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యంపై సమాచారం వాకబు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వైద్యులు ప్రస్తుతం ప్రత్యేకమైన వైద్య పర్యవేక్షణలో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు.

