యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం, మహాదేవపురంలోని అక్కన్న – మాదన్న ఆలయం ప్రాంగణం చిత్రీకరణతో సందడిగా మారింది.ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసి, గ్రామస్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తారలు తమ గ్రామాన్ని సందర్శించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో గ్రామానికి గుర్తింపు వస్తుందనే ఆశతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

