రాష్ట్రంలో ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆయన మాట్లాడుతూ, బ్లాక్ స్థాయిలో కూడా ఎరువులు అందుబాటులో లేవని, గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. రైతుల అవసరాలకు తగిన విధంగా ఎరువులు అందుబాటులో ఉంచడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలన్నారు.
అదే విధంగా, బుడమేరు ఘటనను ప్రస్తావిస్తూ, కొద్దిమంది మాత్రమే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ, మందుల దొరక్కపోవడం, తిండిలేకపోవడమే ప్రధాన కారణమని చెప్పారు. తిరుపతిలో జరిగిన అపశృతి పట్ల స్పందిస్తూ, ముప్పై మందిని సక్రమంగా మానిటరింగ్ చేయడంలో విఫలమవడం మానవ తప్పిదమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేపడుతున్న పనులు, అప్పుల వినియోగం, పెన్షన్, గ్యాస్ సిలిండర్ అంశాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. నాడూ-నేడు పథకంలో పనులు ఆపేసి, ముందుకు ఏం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

