అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్, తన ప్రేయసి జైనాబ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. గతంలో నాగచైతన్య పెళ్లి సందర్భంగా అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
అఖిల్ వివాహం మార్చి 24న జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నాగార్జున ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లను కూడా ఆహ్వానించనున్నారు.
నాగార్జున ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అఖిల్ పెళ్లి మరింత వైభవంగా ఉండాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.

