ఘట్కేసర్‌లోని గట్టు మైసమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి KCR, మంత్రి KTR చిత్రాలు ఉన్నాయి. ఫ్లెక్సీలో చంద్రబాబుకు “బాస్ ఈజ్ బ్యాక్,” పవన్‌కు “ట్రెండ్ సెట్టర్,” KCRకు “గాడ్ ఆఫ్ TG కమింగ్ సూన్,” KTRకు “ఫ్యూచర్ ఆఫ్ TG” అంటూ క్యాప్షన్లు జోడించారు. అదనంగా, సీనియర్ NTR, నారా లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు వంటి ప్రముఖుల ఫొటోలు కూడా ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఫ్లెక్సీని అభిమానులు జాతర సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

