యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ పంచాయితీ కార్యదర్శి పై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఆలేరు మండలం శారాజిపేటకు చెందిన రాజశేఖర్, మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం విధులకు గ్రామానికి వెళ్తున్న సమయంలో, మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది. గాయపడిన రాజశేఖర్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

