కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి డిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ గారు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై అభినందనలు తెలియజేశారు. అలాగే, ఆమెకు జన్మదినం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన ప్రియాంక గాంధీని మళ్లీ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించాలని కోరారు.

