తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందిన నేపథ్యంలో, బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ, కలెక్టర్, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సిఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. భక్తుల మరణానికి బాధ్యులపై కేసులు పెట్టి, దేవునిపై ఉన్న భక్తిని ముఖ్యమంత్రి వ్యక్తపరచాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పడంపై విమర్శిస్తూ, “ఆరుగురు చనిపోతే క్షమాపణలు చెప్పడం సరిపోతుందా? సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయ డ్రామాలు ఆపాలి,” అంటూ జగన్ ట్వీట్ చేశారు.

