ఖమ్మం వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారు తిరుమలాయపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా కారుకు ఒక్కసారిగా రెండు టైర్లు పేలడంతో వాహనం కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. కారులో మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, DCCB చైర్మన్లు బొర్రా రాజశేఖర్, తళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్న మంత్రి, ఈ ఘటనపై తమకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.

