హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని ఆయన అధికారిక నివాసంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఆయా పనులకు సహకరించాలని ఉపముఖ్యమంత్రిని హనుమాండ్ల ఝాన్సీ, డా. రాజేందర్ రెడ్డి దంపతులు కోరారు.

