తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిని సస్పెండ్ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది అని సీఎం సీరియస్ అయ్యారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, మరో అధికారిని వెంటనే బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న సీఎం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

