తెలంగాణ హోం శాఖ కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారిపై కేసులను నమోదు చేయనుంది. బుద్ధభవన్ లో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ కు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారి నియమించొచ్చు. అలాగే, హైడ్రా పోలీస్ స్టేషన్ కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి తెలంగాణ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

