దేవరుప్పులలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
దేవరుప్పుల మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ షాధిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై 60మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 60,06,960 రూ, లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయన్నారు
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.
కొడకండ్ల లో TGRS & JC స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ ఎక్స్ కార్నర్ స్కీం ల్యాబ్ ప్రారంభం
కొడకండ్ల మండల కేంద్రంలోని TGRS & JC స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ ఎక్స్ కార్నర్ స్కీం ల్యాబ్ ని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ…. విద్యార్థినులు తమ సాధన ద్వారా భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగి ఉండాలని, నేటి విద్యార్ధులు రేపటి భారత భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. ఈనాటి ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అనివార్యమని, దీని ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. టెక్నాలజీ ద్వారా విద్యార్ధులు కొత్త అవకాశాలను గుర్తించి, తమ దారిని నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రేరణ ఇచ్చారు. తమ ప్రయత్నం, అంకితభావం ద్వారా ప్రపంచంలో తమ స్థానాన్ని పొందగలిగేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యుత్ నాయకులు, మహిళా నాయకులు, పాఠశాల బృందం, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు..


