తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా కేసు విషయంపై ముందస్తు చర్యగా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సందర్భంలో తమ వాదనలను కూడా పరిశీలించాల్సిందిగా కోరింది. ఫార్ములా అంశంపై ఏకపక్ష నిర్ణయం నిర్ణయాలు తీసుకోకుండా, తమ వాదనను కూడా వినిపించేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ తరఫున ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా, దీనిపై కోర్టు నిర్ణయానికి ముందు తమ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

