తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం వాదనలను అంగీకరించిన న్యాయస్థానం, మద్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడవాలని, అందరికి రూల్ అఫ్ లా (Rule of Law) వర్తిస్తుందని న్యాయస్థానం తెలిపింది.

