ఢిల్లీ సీఎం అతీషిపై బీజేపీ కల్కాజి అభ్యర్థి రమేష్ బీధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అతీషి భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న ఉపాధ్యాయుడిగా జీవితాన్ని గడిపారు. ఈ దేశ రాజకీయాలు ఇంత దిగజారుతాయని ఎప్పుడూ అనుకోలేదు” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బీధూరి, ఆమె ఇంటిపేరు సింగ్ ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

