అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ కోసం ఈ ఏడాది 19 మంది ఎంపికయ్యారు. ఈ జాబితాలో యూఎస్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫుట్బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సి, ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ తదితరులు ఉన్నారు. వైట్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. అమెరికా మరియు ప్రపంచ శాంతి కోసం వారి రంగాల్లో విశేష కృషి చేసినందుకు వీరిని సత్కరించనున్నట్లు బైడెన్ తెలిపారు.
హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ప్రపంచ స్థాయి కుబేరుల్లో ఒకరు. ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా 70కిపైగా దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇన్వెస్టర్‌గా కూడా చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఈ పురస్కార గ్రహీతలందరూ అమెరికా అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినవారని అభినందించారు.
అమెరికా అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన 19 మంది

