ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో సమావేశమై, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న రూ.2,250 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని కలవగా, బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపాము. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చర్యలు తీసుకుని పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతున్నాం” అని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బకాయిల చెల్లింపులు ఆలస్యం కారణంగా వైద్య సేవలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

