ఏపీ మంత్రి నారా లోకేశ్ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించిన లోకేశ్, విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుందని, ఆర్థికంగా కుటుంబాలను మెరుగుపరచుకోవచ్చని ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా నిర్వహించారు.

