ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ త్వరలో తన ప్రియురాలు ఎల్లా విక్టోరియా మలోన్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ వారాంతంలో ఓ రహస్య ప్రాంతంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరుగనుందని నార్వే మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని కార్ల్సన్ స్నేహితుడు మాగ్నస్ బార్స్టాడ్ ధ్రువీకరించారు. తాజాగా, వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్‌లో రష్యా ఆటగాడు ఇయాన్ నెపోమ్నియాచితో తలపడిన కార్ల్సన్, మూడు గేమ్‌లు డ్రాగా ముగియడంతో టైటిల్‌ను పంచుకున్నారు. కార్ల్సన్ బ్లిట్జ్ టైటిల్ గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి.

